Nara Lokesh | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ కు క్షమాపణ చెప్పారు. ఆయన సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లారు.
అయితే ఆయన కాన్వాయ్ రోడ్డుపై వెళుతున్న సమయంలో మరో పౌరుడి కారును తాకింది. దీంతో ఆ కారుకు కాస్త డ్యామేజ్ అయింది. కానీ ఆ సమయంలో కాన్వాయ్ ఆపలేదు.
తాజాగా తన కారు మీ కాన్వాయ్ వల్ల డ్యామేజ్ అయ్యిందంటూ కల్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నారా లోకేష్‌కు ట్యాగ్ చేశారు. డ్యామేజీకి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించారు.
తన కాన్వాయ్ వల్ల జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరుతున్నాని పేర్కొన్నారు. మరోసారి ఇలా జరగకుండా తన సెక్యూరిటీకి జాగ్రత్తలు చెబుతానన్నారు. కారుకు అయిన డ్యామేజీ ఖర్చును తన టీమ్ భరిస్తుందని హామీ ఇచ్చారు. కాగా, లోకేష్ స్పందనపై కారు యజమాని కల్యాణ్ భరద్వాజ్ సంతోషం వ్యక్తం చేశారు.