TN Govt Honor To SP Balu | గాన గంధర్వుడు, సంగీత ప్రియుల మదిలో నిలిచిపోయిన దివంగత నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి (SP Balasubramanyam) తమిళనాడు ప్రభుత్వం ఓ అరుదైన గౌరవం కల్పించింది.
సెప్టెంబర్ 25న ఎస్పీ బాలు (SP Balu) 4 వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారకార్థం తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ వీధికి బాలసుబ్రమణ్యం పేరు పెట్టింది.
ఎస్పీ బాలు నివాసం ఉన్న చెన్నై లోని నుంగం బాక్కమ్ లోని కాందర్ నగర్ మెయిన్ రోడ్డును ‘ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం రోడ్’ (SP Balasubramanyam Raod) గా మారుస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు.
ఎస్పీబీ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలసుబ్రహ్యణ్యం దాదాపు 5 దశాబ్దాలపాటు సినీ జీవితం గడిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా 16 భారతీయ భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు.
2020 ఆగస్టు 5న కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దాదాపు 50 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు.