Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్ లు..యూనిఫార్మ్ నమూనా విడుదల

ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్ లు..యూనిఫార్మ్ నమూనా విడుదల

Transgenders To Regulate Traffic In Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ ( Traffic )నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy )నిర్ణయం తీసుకున్నారు.

సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ ( Transgender )లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోమ్ గార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు.

హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు.

అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్​జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని చెప్పారు.

విధుల్లో ఉండే ట్రాన్స్​జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ ( Uniforms ) కూడా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు యూనిఫార్మ్ నమూనాను విడుదల చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions