Thursday 19th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రేపిస్టులకు మరణశిక్ష విధించే బిల్లును తీసుకువస్తాం..ఆమోదించండి

రేపిస్టులకు మరణశిక్ష విధించే బిల్లును తీసుకువస్తాం..ఆమోదించండి

 Death Penalty to Rapists | వెస్ట్ బెంగాల్ ( West Bengal ) కోల్కత్త ( Kolkata ) లోని ట్రైనీ డాక్టర్ ( Trainee Doctor ) పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరోవైపు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ ( Cm Mamata Banerjee ) రాజీనామా చేయాలని నబన్నా అభియాన్ ర్యాలీ మంగళవారం జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం ప్రయోగించడంతో బీజేపీ ( BJP ) బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో త్రినముల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషద్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీఎం మమతా కీలక వ్యాఖ్యలు చేశారు. హత్యాచార కేసులో విచారణ కోసం తాను ఐదు రోజుల సమయం అడిగామని, కానీ కేసును సీబీఐకి అప్పగించారని తెలిపారు.

సీబీఐకి కేసును అప్పగించి 16 రోజులు అవుతున్నా న్యాయం ఎక్కడ అని సీఎం ప్రశ్నించారు. తాము త్వరలోనే రేపిస్టులకు మరణశిక్ష విధించాలని ( Capital Punishment ) డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును తీసుకురానున్నట్లు ప్రకటించారు.

నేరం జరిగిన వారం రోజుల్లోనే రేపిస్టులకు మరణశిక్ష పడేలా చూస్తామని, ఈ బిల్లును గవర్నర్ కు పంపిస్తామని చెప్పారు. ఈ బిల్లుకు తప్పక ఆమోదం లభించాలని సీఎం మమతా నొక్కి చెప్పారు.

You may also like
కోల్కత్త హత్యాచార ఘటన..నిందితుడు సంచలన ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions