Congress MLC Mahesh Kumar | ఢిల్లీ మద్యం స్కాం (Delhi Liquor Scam) ఆరోపణలతో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బెయిల్ మంజూరు కావడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC Working President), ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) స్పందించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కవిత కు బెయిల్ వస్తుందని ముందుగానే ఊహించామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు కావడం వల్లనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ (BJP) కుమ్మక్కై అయ్యి బిజెపి కి బిఆర్ఎస్ దాసోహం అయ్యిందని విమర్శించారు. హరిశ్, కేటీఆర్ ఇద్దరూ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు.
బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కవితకు బెయిల్ (Bail For Kavitha) రావడంతో బీజేపీ లో బిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందని సంచలన కామెంట్స్ చేశారు మహేశ్ కుమార్. ఇక బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందన్నారు.