Wayanad Landslide News | కేరళ ( Kerala ) లోని వయనాడ్ ( Wayanad ) లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. మరోవైపు ఈ ఘటనపై కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
కొండచరియలు విరిగిపడడాని కంటే వారం రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని, అయినా కేరళ ప్రభుత్వం ప్రజల్ని తరలించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. తమకు ఎలాంటి అలెర్ట్ ( Alert ) జారీ చేయలేదన్నారు. విపత్తుకు ముందు వయనాడ్ కు కేంద్రం రెడ్ అలెర్ట్ ( Red Alert ) జారీ చేయలేదని సీఎం చెప్పారు.
హెచ్చరికలు జారీ చేయడానికి ముందే కొండచరియలు విఐగిపడ్డాయని పేర్కొన్నారు. అయినా ఇది నిందలు వేసుకునే సమయం కాదని అమిత్ షా కు సీఎం విజయన్ సూచించారు.