Kumari Aunty Hotel | హైదరాబాద్ లోని స్ట్రీడ్ ఫుడ్ సెంటర్ (Streed Food) నిర్వహిస్తున్న కుమారి ఆంటీ (Kumari Aunty) ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఫుడ్ సెంటర్ కి ఒక్కసారిగా జనం క్యూ కట్టడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఉన్నపళంగా ఆ హోటల్ ను మూసివేయించారు. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ హోటల్ మూసివేత విషయం సీఎం రేవంత్ దృష్టికి చేరింది. దీంతో సీఎం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
హోటల్ మూసివేయాలనే ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ, ఎంఏయూడి కి ఆదేశాలు జారీచేశారు సీఎం రేవంత్. కుమారి అంటి హోటల్ యధావిధిగా అదే ప్రాంతంలో ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రజాపాలన ద్వారా తమ ప్రభుత్వం మహిళా చిరు ఉద్యోగులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని, త్వరలోనే సీఎం రేవంత్ కూడా కుమారి ఆంటీ హోటల్ ను సందర్శిస్తారని తెలుస్తోంది.