Friday 22nd November 2024
12:07:03 PM
Home > తాజా > కొత్త రేషన్ కార్డులకు ‘మీ సేవ’ లో అప్లికేషన్లు!

కొత్త రేషన్ కార్డులకు ‘మీ సేవ’ లో అప్లికేషన్లు!

Ration Cards

New Ration Cards Applications | కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారుల నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగం గానే ప్రజా పాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవా ద్వారా అప్లై చేయొచ్చు..

అభయ హస్తం పేరుతో మొత్తం 5 గ్యారెంటీ లకు దాదాపు కోటి పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు.

అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్క్రూటినీ చేయడం త్వరగా అయ్యే పనికాదు. దీని వల్లే రేషన్ కార్డుల కోసం అధికారికంగా మీ సేవా ద్వారా అప్లికేషన్లను స్వీకరించాలని డిసైడ్ చేశారు.

కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల్లో పేరు లేని వారు కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సర్కారు చెబుతోంది.

Read Also: “ఆయన ప్రోద్బలంతోనే సీఎంను కలిశారు” రఘునందన్ కీలక వ్యాఖ్యలు!

ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చిన అభయ హస్తం అప్లికేషన్స్ లో రేషను కార్డు, ధరణి తదితరాల కోసం అదనంగా మరో 19,92,747 అప్లికేషన్లు వచ్చాయి. రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రం లోని పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డు అత్యంత ఉపయోగకరమైనది కావడంతో ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తోంది.

ఇందులో భాగం గానే ఓ వైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు అభివృద్ది కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.

బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాలని స్పష్టం. ఈ ప్రక్రియ గత 5 నెలలుగా కొనసాగుతోంది.

అయితే, రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోవడానికి జనవరి 31 తుది గడువుగా ఉంది. అ లోపు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రేషన్ కార్డు ఈ కేవైసీని సింపుల్ గా చేసుకోవచ్చని చెబుతున్నారు. రేషన్ డీలర్లకు వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి.. ఆ తర్వాత వేలి ముద్రలు నమోదు చేస్తే ఈ-కేవైసీ పూర్తవుతుందని వివరిస్తున్నారు.

రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

జనవరి 31వ తేదీ లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు లింక్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ సూచించారు.

భారత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా రేషన్ బియ్యం, ఇతర సరకులు అందిస్తున్నారు

You may also like
cm revanth visits vemulawada
వేములవాడలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు!
eatala rajendar
లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ నాయకులదే: ఈటల రాజేందర్!
srikanth sravya
సీఎం గారూ మా పెళ్లికి రండి: శ్రీకాంత్-శ్రావ్య!
ktr comments
మంత్రుల ఫోన్  ట్యాప్ చేస్తున్నారు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions