Thursday 1st May 2025
12:07:03 PM
Home > సినిమా > రీసెంట్‌గా జపాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ

రీసెంట్‌గా జపాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ

Recently, Kollywood star hero Karthi came before the audience with a Japanese movie

నవంబర్‌ 10న గ్రాండ్‌గా విడుదలైంది. రాజు మురుగన్‌ దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కార్తీ మార్క్‌ కామెడీతో సాగే జపాన్‌కు బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది.
కాగా ఈ సినిమాను థియేటర్‌లో మిస్సయిన వారి కోసం డిజిటిల్‌ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చింది. జపాన్‌ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి కార్తీ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఓటీటీలో చూసేయండి. ఫస్ట్‌ లుక్ పోస్టర్‌, ఇంట్రడక్షన్‌ వీడియో, టీజర్‌, ట్రైలర్.. ఇలా ప్రతీ ఒక్కటి సినిమాపై హైప్‌ పెంచేసినప్పటికీ.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది జపాన్‌. మరి జపాన్‌కు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
జపాన్ కోసం కార్తీ ఇదివరకెన్నడూ కనిపించని విధంగా మేకోవర్‌ మార్చేసుకున్నాడని.. ఇప్పటివరకు వచ్చిన లుక్స్ చెబుతున్నాయి. జపాన్ వర్కింగ్‌ స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

You may also like
pawan kalyan
నేటి నుంచి వాళ్లను అలా పిలవొద్దు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి!
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions