- బీఆరెస్ ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం
KCR as BRSLP Leader | తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆరెస్ శాసనసభ పక్ష నేతగా మాజీ సీఎం, బీఆరెస్ సుప్రీమో కేసీఆర్ ను ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు.
ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యారు. కాగా బీఆరెస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు బలపరిచారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ను బీఆరెస్ ఎల్పీ నేతగా ఎమ్మెల్యే లంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం అందరూ ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీ కి బయలుదేరారు. ఇదిలా ఉండగా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే లంతా ప్రమాణ స్వీకారం చేశారు.