Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > BRSకు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరుతున్న కీలక నేత!

BRSకు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరుతున్న కీలక నేత!

mandava

Shock To BRS | తెలంగాణ ఎన్నికల పోలింగ్ (Telangana Polls)కు ముందు అధికార బీఆరెస్ (BRS Party)కు మరో షాక్ తగిలింది.

ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా నిజామాబాద్ నుంచి ముఖ్య నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు.

మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు (Mandava Venkateswar Rao) శనివారం కాంగ్రెస్ లో చేరుతున్నారు.

బోధన్‌లో జరగనున్న కాంగ్రెస్ విజయ భేరి సభలో రాహుల్ గాంధీ సమక్షంలో మండవ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

గత పార్లనెంట్ ఎన్నికల సమయం లో బీఆర్‌ఎస్‌ లో చేరిన మండవ పార్టీలో తనకు తగిన గౌరవం దక్క లేదని కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

తాజాగా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. వెంకటేశ్వర రావు చేరికతో నిజామాబాద్ జిల్లాలో సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది.

మండవ వెంకటేశ్వర రావు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి డిచ్‌పల్లి (Dichpally) అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1985, 1989, 1994, 1999 ఎన్ని కల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మె ల్యే గా గెలిచారు.

You may also like
Election commission
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
evm
ఈవీఎంలకే ప్రజల ఓటు.. రాహుల్ పై బీజేపీ సెటైర్లు!
kcr names his fan's son
అభిమాని కుమారుడికి పేరు పెట్టిన కేసీఆర్!
diksha vijay divas celebrations in telangana bhavan
‘దేశానికి గాంధీ ఎంతో.. తెలంగాణకు కేసీఆర్ అంతే’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions