Errabelli Dayakar Rao | అసెంబ్లీ ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి, పాలకుర్తి బీఆరెస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakar Rao).
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ..గతంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో తరతమ భేదాలు లేకుండా అందరికీ కొలువులు, ఊరూరా ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు ఎర్రబెల్లి.
అప్పుడు జనరల్ గా ఉద్యోగాలు ఇప్పించానని కానీ ఇప్పటి నుండి అలా ఉండదని స్పష్టం చేశారు.
Read Also: కాంగ్రెస్ అభ్యర్థికి రూ. 1.06 కోట్లు బాకీ ఉన్న కేసీఆర్!
కార్యకర్తలకు, కార్యకర్తల బిడ్డలకు మాత్రమే ఇకనుండి ఉద్యోగాలు ఇప్పిస్తానని, రెండవది తనకు ఓట్లు వేసిన వారికే జాబ్స్ ఇప్పిస్తానని పేర్కొన్నారు ఆయన.
బీఆరెస్ (BRS Party) ప్రచారానికి వచ్చి, కాంగ్రెస్ కు ఓట్లు వేసేవారికి కాకుండా బీఆరెస్ తోనే ఉండే వారికి కొలువులు ఇప్పిస్తా అంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఆయన వ్యాఖ్యల పై విమర్శలు గుప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాగా పాలకుర్తి నుండి బీఆరెస్ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు ఎర్రబెల్లి.
ఆయనపై కాంగ్రెస్ నుంచి యశస్విని రెడ్డి, బీజేపీ నుంచి లేగ రామ్మోహన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.