Vijayashanti | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ(BJP)కి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy), వివేక్ వెంకటస్వామి (Vivek VenkataSwamy) తదితరులు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కూడా బీజేపీ ని వీడి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు విజయశాంతి కాంగ్రెస్ లో చేరడాన్ని శనివారం నాడు మల్లు రవి ధ్రువీకరించారు.
కొద్ది కాలంగా విజయశాంతి బీజేపీ పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి, అంతేకాకుండా ఎక్స్ వేదికగా ఆమె చేసిన పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారాయి.
Read Also: ‘కేసీఆర్ ను కొరడాతో కొట్టిన తప్పులేదు’ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్!
ప్రధాని మోదీ, అమిత్ షా లు తెలంగాణలో హాజరైన సభలకు కూడా డుమ్మా కొట్టారు. అలాగే ఇటీవలే బీజేపీ ప్రకటించిన స్టార్ కాంపెయినర్స్ లిస్ట్ లో ఆమెకు చోటు లభించలేదు.
దీంతో విజయశాంతి పార్టీ మారుతరంటూ జరుగుతున్న ప్రచారానికి ఊతం ఇచ్చినట్లైంది.
ఆదివారం లేదా సోమవారం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఢిల్లీ అధినాయకత్వం తో చర్చలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం.