Friday 22nd August 2025
12:07:03 PM
Home > తెలంగాణ > Munugoduలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా!

Munugoduలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా!

Munugodu

Munugodu Congress | మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komatireddy Rajagopal Reddy) షాక్ తగిలింది. ఇటీవల బీజేపీ (BJP)కి రాజనామా చేసి కాంగ్రెస్ (Congress)లో చేరిన ఆయనకు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు షాక్ ఇచ్చారు.

కాంగ్రెస్ టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకొని కంగుతిన్న దివంగత నేత పాల్వా యి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi) కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం లేదా ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని ప్రకటిం చడం తో ఆమె పార్టీమారుతున్న ట్లు ప్రచారం జరిగిం ది. ఈ వార్తలు అవాస్తవమని ఇటీవల స్వయంగా పాల్వాయి స్రవంతి కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని తేల్చిచెప్పారు..

ఇంతలోనే ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వెంట నియోజకవర్గానికే చెందిన పలువురు కీలక నేతలు కూడా కాంగ్రెస్ ను వీడనున్నట్లు సమాచారం.  

మరోవైపు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ చలమల్ల క్రిష్ణారెడ్డి (Chalamalla Krishna Reddy) కూడా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) ఉన్నారు.

You may also like
తెలంగాణలో ‘టూరిస్ట్ పోలీసులు’
rahul gandhi
ఈసీకి రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు!
‘ఆంధ్ర సినిమాలను అడ్డుకున్న ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి’
‘తెలంగాణ కులగణన సర్వే దేశానికే ఆదర్శం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions