Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > Hyderabad నగరంలో మోదీ పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలివే!

Hyderabad నగరంలో మోదీ పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలివే!

hyd traffic

Modi Hyderabad Tour | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం హైదరాబాద్ (Hyderabad) రానున్నారు.
పరేడ్ గ్రౌండ్స్‌ (Pared Grounds) లో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీస్ (MRPS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదిగల విశ్వరూప మహా సభలో మోదీ పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ పర్యటన సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic) విధించారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రూట్లివే..!

  • సంగీత్ ఎక్స్ రోడ్ నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలను వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్ – ప్యాట్నీ – ప్యారడైజ్ – CTO – రసూల్‌పురా – బేగంపేట వైపు వెళ్లాలి.
  • బేగంపేట నుంచి సంగీత్ X రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సీటీవో X రోడ్ల వద్ద బాలమ్రాయ్ – బ్రూక్ బాండ్ – టివోలి – స్వీకర్ ఉప్కార్ – YMCA – సెయింట్ జాన్స్ రోటరీ – సంగీత x రోడ్ల వైపు మళ్లిస్తారు.
  • బోయిన్‌పల్లి, తాడ్‌బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్ బ్రూక్ బాండ్ వద్ద సీటీవో – రాణిగంజ్ – ట్యాంక్‌ బండ్ వైపు మళ్లిస్తారు.
  • కార్ఖానా, జేబీఎస్ నుండి ఎస్బీహెచ్-పాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను స్వీకర్ ఉపకార్ వద్ద వైఎంసీఏ – క్లాక్ టవర్ – ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్ బాండ్ – బాలమ్రాయ్-సీటీవో వైపు డైవర్ట్ చేస్తారు.
  • ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలు ఎస్బీహెచ్- స్వీకర్ ఉపకార్ వైపు అనుమతించబడవు. క్లాక్ టవర్-వైఎంసీఏ లేదా ప్యారడైజ్-సీటీవో వైపు మళ్లిస్తారు.
  • ఆర్టీఏ తిరుమల గిరి, కార్ఖానా, మల్కాజ్‌గిరి, సఫిల్‌ గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను టివోలి వద్ద స్వీకర్-ఉపాకార్, వైఎంసీఏ లేదా బ్రూక్ బాండ్, బాలమ్రాయ్, సీటీవో వైపు వెళ్లాలి.
  • జూబ్లీహిల్స్ చెక్‌ పోస్టు నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్ వైపు, గ్రీన్ ల్యాండ్‌ వద్ద రాజ్‌ భవన్ వైపు వెళ్లాలి.
  • పంజాగుట్ట – గ్రీన్ లాండ్స్ – బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లేవారు రూట్లల్లో ప్రయాణం చేయకపోవడం ఉత్తమం.
You may also like
pm modi
కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం: ప్రధాని మోదీ
Modi Puthin
ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం.. అందజేసిన పుతిన్!
sambit patra
పూరి జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడు: బీజేపీ నేత వివాదస్పద వ్యాఖ్యలు!
ktr
పిరమైన మోదీగారు.. విషం చిమ్మకండి: కేటీఆర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions