JrNTR Flexi in Ongole | ఆంధ్రప్రదేశ్ ఒంగోలు (Ongole) పట్టణంలో ఫ్లెక్సీలు (flexis) కలకలం రేపుతున్నాయి.
టీడీపీ (TDP) తరపున తర్వాత కాబోయే సీఎం జూ. ఎన్టీఆర్ (jr.ntr) అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అలాగే ‘అసలోడు వచ్చేదాకా కోసరోడికి పండగే’ అంటూ ఫ్లెక్సీలో రాశారు.
నగరంలోని ప్రధాన కూడల్లో(junctions) ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.
కాగా ఒంగోలు జిల్లాలోని నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది.
ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫ్లెక్సీలు
నారా లోకేష్ యువగళం (Yuva Galam) పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొద్దీ రోజుల్లో ప్రారంభం కానుంది. లోకేష్ కు స్వాగతం పలకడానికి టీడీపీ (TDP) శ్రేణులు ఒంగోలులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అందులో భాగంగానే పట్టణంలో నారా లోకేశ్ కు స్వాగతం పలకడానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పోటీగా జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
కాగా ఈ పని (JrNTR Flexi in Ongole) వైసీపీ (YCP) నాయకులదే అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఫ్లెక్సీల వెనుక ఒంగోలు మొదటి డివిజన్ (division) వైసీపీ అధ్యక్షుడు సాంబశివరావు ఉన్నట్లు టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సభల్లో, లోకేష్ యువగళం పాదయాత్రలో జూ.ఎన్టీఆర్ నినాదాలు, బ్యానర్లు తరచు కనిపిస్తూనే ఉంటాయి.
దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తూ వస్తున్నారు.