Sharmila Slams KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు.
కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన(KCR Maharashtra tour)పై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో బందిపోట్ల సోకు రాజకీయాలు అంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిన పాపానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మహారాష్ట్ర ప్రజలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు షర్మిల (YS Sharmila).
‘రాష్ట్ర ప్రభుత్వం’ మొత్తం పక్క రాష్ట్రానికి తరలిపోయింది. దొర తెలంగాణకు ముఖ్యమంత్రా? లేక మహారాష్ట్రకా? అని నిలదీశారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా బందిపోట్లలాగా ఇక్కడి సంపదను కొల్లగొట్టి పక్క రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటన.. శివసేన ఆసక్తికర వ్యాఖ్యలు!
“రాష్ట్ర ప్రజానీకం బీఆర్ఎస్ దుర్మార్గాలను గుర్తించాలి. ప్రజలను గాలికొదిలి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పక్క రాష్ట్రానికి వెళ్లిందంటే తెలంగాణపై కేసీఆర్ కున్న చిత్తశుద్ధి ఏంటో గమనించాలి.
వెళ్లే దారిలో కూడా ఇక్కడి ప్రజలను అవస్థలకు గురిచేసిన దొంగలు ఈ బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో పాలన అటకెక్కింది, వ్యవస్థలన్నీ శూన్యం.
మన గ్రామాలు సందర్శించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి తీరిక లేదు కానీ రాజకీయాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే సమయం మాత్రం ఉంది.
కాంగ్రెస్ లో ఇలాంటి పరిస్థితి చూస్తా అనుకోలేదు: జగ్గారెడ్డి ఆవేదన
ఇక్కడ తిరిగి సమస్యలు తెలుసుకోలేని బందిపోట్లు. పక్క రాష్ట్రాల ప్రజలను ఉద్ధరిస్తామనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్. తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకోండి.
రాజకీయాలకు రంగులు మార్చే ఈ బీఆర్ఎస్ దొంగలను రాష్ట్రం నుంచే కాదు ఈ దేశం నుంచే తరిమికొట్టాలి” అని పిలుపునిచ్చారు షర్మిల.