Yuvraj Singh trains Priyansh Arya and Prabhsimran Singh | క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కూడా దేశ క్రికెట్ కు ఎనలేని సేవలు అందిస్తున్నారు యువరాజ్ సింగ్. మేటి ఆటగాళ్లను తయారు చేస్తూ దేశానికి అందిస్తున్నారు.
ఐపీఎల్, అంతర్జాతీయ టీ-20ల్లో ప్రస్తుతం ఆసియా కప్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న అభిషేక్ శర్మ ఒకప్పుడు యువరాజ్ కింద శిక్షణ పొందిన వాడే. అలాగే భారత టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్ సైతం యూవీ శిష్యుడే. ఇప్పుడు మరో ఆటగాన్ని డైనమైట్ లా తీర్చిదిద్దెందుకు సిద్ధమయ్యాడు యూవీ.
ఐపీఎల్-2025 లో భాగంగా పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతమైన ఆట తీరును కనబర్చాడు ప్రియాన్ష్ ఆర్య. ఇప్పుడు అతడు యూవీ వద్ద శిక్షణ పొందుతున్నాడు. తన క్రికెట్ కెరీర్ ద్వారా నేర్చుకున్న పాఠాలను యువ ఆటగాళ్లకు వివరిస్తున్నారు యూవీ. ప్రియాన్ష్ ఆర్యకు యూవీ శిక్షణ ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అలాగే పంజాబ్ కింగ్స్ మరో బ్యాటర్ ప్రభసిమ్రాన్ సింగ్ ను కూడా యూవీ తీర్చిదిద్దుతున్నాడు.









