Ys Sharmila News | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరిచిన అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు.
ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని నిలదీశారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అన్నారని, 5 ఏళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికి బీజేపీకి జై కొట్టారని షర్మిల వైసీపీ పై విరుచుకుపడ్డారు.
దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన RSS వాదికి మద్దతు ఇస్తారా? అని జగన్ పార్టీని షర్మిల ప్రశ్నించారు. ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం అని అన్నారు.
దీనిపై రాష్ట్ర ప్రజలకు YCP సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ ముసుగు మళ్ళీ తొలగిందని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని, బీజేపీకి బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగిందన్నారు. ప్రధాని మోదికి జగన్ దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. BJP అంటే “బాబు జగన్ పవన్” అని తెలిపారు.









