- కాంగ్రెస్ లో చేరిక అనంతరం కీలక వ్యాఖ్యలు
YS Sharmila | వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikharjun Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.
దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) కాంగ్రెస్ (Congress)లో విలీనం పూర్తయ్యింది. కాంగ్రెస్ లో చేరిన అనంతరం షర్మిల మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో మణిపూర్ (Manipur)లో జరిగిన ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్‌లో క్రూర ఘటనలను ఓ క్రైస్తవురాలిగా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. అక్కడ 2 వేల చర్చిలను ధ్వంసం చేశారనీ, 60 వేల మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో నాకు అప్పుడే తెలిసిందన్నారు. ఆ రోజే కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.