Workers Climbed A Tree To Escape From Wild Elephant | హఠాత్తుగా ఓ ప్రైవేట్ ఎస్టేట్ ( Private Estate ) లోకి ఏనుగు వచ్చింది. దీంతో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎస్టేట్ లో పనిచేసే కార్మికులు పక్కనే ఉన్న చెట్లెక్కారు.
తమిళనాడు ( Tamilnadu ) నీలగిరి జిల్లా గుడలూర్ ( Gudalur ) ప్రాంతంలో ఉన్న సిల్వర్ క్లౌడ్ ఎస్టేట్ లో కార్మికులు పనిచేస్తున్నారు. ఇంతలోనే అక్కడికి ఓ ఏనుగు వచ్చింది. దింతో ఏనుగు నుండి తప్పించుకోవడానికి ఇద్దరు కార్మికులు చెట్టు ఎక్కారు. అలా కొద్దీ నిమిషాలు గడిచాయి.
అనంతరం ఏనుగు వెళ్లిపోవడంతో కార్మికులు సురక్షితంగా చెట్టు దిగారు. చెట్టు మీద దాక్కున్న కార్మికుడు ఈ ఘటనను సెల్ ఫోన్లో బందించాడు.