Who Ate Himachal Pradesh Cm’s Samosa ?| హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం సమోసా ( Samosa ) చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.
సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ( Cm Sukhvinder Singh Sukhu ) తినాల్సిన సమోసాలు మిస్ అయినట్లు, ఈ ఘటనపై రాష్ట్ర సీఐడీ ( CID ) విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ 21న రాష్ట్ర సీఎం సుఖు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.
ముఖ్యమంత్రి వస్తున్నారని అధికారులు ఓ ప్రముఖ హోటల్ నుండి సమోసాలు, కేకులు తెప్పించారు. అయితే సమోసాలు సీఎం వద్దకు వెళ్లాడానికంటే ముందే సెక్యూరిటీ వాటిని తినేశారని వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో సీఎం వద్దకు రావాల్సిన సమోసలు ఎవరి వల్ల మధ్యలో మిస్ అయ్యాయి అని తేల్చేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు న్యూస్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ స్పందించింది. సమోసాలు ఇతరులు తింటే ఏమవుతుంది అని కాషాయ పార్టీ ప్రశ్నించింది.
జరుగుతున్న వివాదం పై స్వయంగా సీఎం సుఖు స్పందించారు. ‘అలాంటిది ఏమి లేదని, సీఐడీ విచారణ చేస్తున్న అంశం వేరు. ప్రతిపక్షాలు మాత్రం సమోసా అని ప్రచారం చేస్తున్నారని’ ఆగ్రహం వ్యక్తం చేశారు.