Vetrimaran Meme Viral | తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయనిచ్చిన రియాక్షన్స్ ను ఇప్పుడు నెటిజన్లు మీమ్స్ గా మార్చి వాడుతున్నారు. ఎప్పుడు గంభీరంగా ఉండే వెట్రిమారన్ ను మీమ్ గా మార్చేయడం చూసి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వెట్రిమారన్ సాధారణంగా చాలా గంభీరంగా ఉంటారు.
రాజకీయ, సామాజిక అంశాల గురించి లోతుగా మాట్లాడుతారు. ఇదే సమయంలో ఇటీవల ఈ దర్శకుడికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఇందులో వెట్రిమారన్ ముందు చాలా సీరియస్ గా ఏదో చెప్తారు, ఆ తర్వాత క్షణమే నవ్వుతూ మాట్లాడుతారు. ఈ క్రమంలో ఈ టెంప్లెట్ ను వాడుకుని చాలా మీమ్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఇటీవల ‘మాస్క్’ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కు వెట్రిమారన్ హాజరయ్యారు. ఒక పక్క సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ మరోపక్క నటుడు విజయ్ సేతుపతి ఉన్నారు. వేదికపై మాట్లాడుతున్న ఒకరిని ఉద్దేశించి వెట్రిమారన్ ఏదో మాట్లాడుతూ చేసిన మొఖ కవళికలు, ఇచ్చిన రియాక్షన్స్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి









