United Breweries has stopped supplying KF Beer to Telangana | తెలంగాణలోని మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది.
సంక్రాంతి పండుగ ముందే రాష్ట్రానికి తమ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ( United Breweries Limited ) సంచలన ప్రకటన చేసింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీనే కింగ్ ఫిషర్ ( Kingfisher ) బీర్లను సప్లై చేస్తుంది.
కింగ్ ఫిషర్ బీర్లు సహా ఏడు రకాల బీర్లను తెలంగాణకు సప్లై ( Supply ) చేయబోమని సదరు సంస్థ స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి ప్రధానంగా రెండు కారణాలను వెల్లడించింది.
తెలంగాణలో 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి ధరలు పెంచలేదని, పెరిగిన ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా ధరలు పెంచకపోవడం మూలంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ వెల్లడించింది. అలాగే టీజీబీసిఎల్ ( TGBCL ) నుండి రావాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని పేర్కొంది.
ఈ కారణాల నేపథ్యంలో బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు యూబిఎల్ స్పష్టం చేసింది. ఈ మేరకు సెబీ ( SEBI )కి లేఖను రాసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని కొందరు మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.