Jagan To visit Tirumala | ఏపీలో తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదం మరింత ముదురుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఈ ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం తిరుమల వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శించుకోవాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) హాట్ కామెంట్స్ చేశారు.
తిరుమలలో జగన్ ను డిక్లరేషన్ (Tirumala Declaration) అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమని హెచ్చరించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వ కపోతే దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి లేదన్నారు.
గత ఐదేళ్లు సీఎం గా స్వామివారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించినప్ప టికీ డిక్లరేషన్ అడగటం దారుణమని అభిప్రాయపడ్డారు. డిక్లరేషన్ వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని, తమను ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామన్నారు.