TLSPRB Recruitment 2025 | తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అతి త్వరలోనే గుడ్ న్యూస్ లభించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని పోలీసు శాఖలో ఏకంగా 12 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది.
ఉద్యోగాల భర్తీపై సమగ్ర ప్రణాళిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. తాజగా ఈ కమిటీ పోలీసు శాఖలో 12, 452 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. అధికంగా పోలీస్ కానిస్టేబుల్-సివిల్ 8,442 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్-సివిల్ లో 677, పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్)-3,271, సబ్ ఇన్స్పెక్టర్ (ఏఆర్)-40, ఎస్ఐ (టీజీఎస్పీ) లో 22 ఖాళీలు ఉన్నట్లు తేలింది.
ఈ మేరకు ఆర్థిక శాఖకు పోలీసు విభాగం సమర్పించిన నివేదికలో పేర్కొంది. మాజీ సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలోని సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రతీ శాఖలోని పని చేస్తున్న ఉద్యోగులు, ఆయా శాఖలోని ఖాళీలు వంటి అంశాలను పరిశీలిస్తోంది. అనంతరం ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. దీని ఆధారంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను రూపొందించి, భర్తీ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.









