Thursday 21st November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూల్‌లోకి అనుమతించని యాజమాన్యం

అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూల్‌లోకి అనుమతించని యాజమాన్యం

The management did not allow the girl wearing Ayyappa mala to enter the school

-బండ్లగూడలోని స్కూల్‌లో ఘటన
-యూనిఫాం లోనే రావాలని చెప్పిన యాజమాన్యం
-స్కూల్ ఎదుట నిరసన తెలిపిన తండ్రి

హైదరాబాద్ బండ్లగూడలో ఓ ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం… అయ్యప్ప మాల ధరించిన బాలికపై దురుసుగా ప్రవర్తించింది. మాల వేసుకున్న ఓ చిన్నారిని లోపలకు అనుమతించలేదు. పాఠశాలలోకి మాలతో అనుమతి లేదని, స్కూల్ దుస్తుల్లోనే రావాలని చెప్పింది. దీంతో మాల వేసుకున్న పాప దాదాపు గంటపాటు ఎండలో నిలబడవలసి వచ్చింది. ఈ విషయమై తండ్రికి సమాచారం ఇవ్వగా.. అసలు తన కూతుర్ని స్కూల్ లోకి ఎందుకు అనుమతించడం లేదని తండ్రి స్వామి నిలదీశారు.
స్కూల్ యూనిఫామ్‌లోనే అనుమతిస్తామని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఆయన స్కూల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో తీసేందుకు ప్రయత్నించగా.. స్కూల్ యాజమాన్యం అడ్డుకుందంటూ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పాపను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను మాల వేసుకున్నానని లోనికి రానివ్వడం లేదని, తాను గంట నుంచి బయట నిలుచున్నట్లు స్వామి మాలలో ఉన్న బాలిక తెలిపారు.

You may also like
అమెరికాలో అదానిపై కేసు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం పవన్ సార్
అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !
ఝార్ఖండ్ ఎవరి సొంతం !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions