Telangana Panchayati Elections | తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం తుది విడత ఎన్నికలు ముగిశాయి. మొత్తం మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు డిసెంబర్ 22న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. ముందుగా ఈనెల 20 అనుకున్నప్పటికీ పలువురు ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
డిసెంబర్ 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రమాణస్వీకారం చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.









