Telangana Govt Focus On Hyderabad Indiramma Houses | పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త అందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింప చేస్తున్నామన్నారు.
కనీసం 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జి ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు జీవో నంబర్ 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తున్న రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని దశల వారీగా నిర్మాణపు పనుల స్థాయిని బట్టి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.









