Wednesday 18th February 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పిటిషన్ డ్రాఫ్టింగ్స్ లో ఏఐ వినియోగం.. సుప్రీంకోర్టు ఆందోళన!

పిటిషన్ డ్రాఫ్టింగ్స్ లో ఏఐ వినియోగం.. సుప్రీంకోర్టు ఆందోళన!

supreme court

AI In Petition Drafting | న్యాయ వ్యవస్థలో ఏఐ (AI) వినియోగం పట్ల భారత సుప్రీంకోర్టు (Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. కృత్రిమ మేధస్సు సహాయంతో తయారు చేస్తున్న పిటిషన్లలో తప్పుడు కేసు సూచనలు పెరుగుతున్నాయని న్యాయమూర్తులు ఆందోళన చెందారు.

“కొంతమంది న్యాయవాదులు ఏఐతో డ్రాఫ్ట్‌లు సిద్ధం చేస్తున్నారు. ఇది అసలు సమంజసం కాదు,” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్నే తృత్వంలోని బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొంది.

ఇటీవల “Mercy v. Mankind” అనే అసలు లేని తీర్పును సైటేషన్‌గా చూపిన ఘటనను ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రస్తావించారు. సరైన తీర్పు పేరును చూపించి, అందులో లేని వ్యాఖ్యలను జోడించడం వల్ల న్యాయమూర్తులపై అదనపు భారం పడుతోందన్నారు.

పిటిషన్ డ్రాఫ్టింగ్ లో కొంతమంది న్యాయవాదుల నైపుణ్యం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీనియర్ న్యాయవాది Ashok Kumar Sen వంటి ప్రముఖులు స్పష్టమైన, సంక్షిప్తమైన పిటిషన్లతో గుర్తింపు పొందారని చెప్పారు. ఇటీవల Bombay High Court కూడా AI సృష్టించిన తప్పుడు సైటేషన్లు చూపినందుకు జరిమానా విధించింది.

You may also like
cm revanth
కార్బన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
currency notes on bride
పెళ్లి వేడుకలో వధువుపై కరెన్సీ నోట్ల వర్షం!
Supreme Court Of India
మహిళ దుస్తులు లాగడం కూడా అత్యాచార యత్నమే: సుప్రీంకోర్టు!
wife sells her husband
రియల్ లైఫ్ శుభలగ్నం.. భర్తను ప్రియురాలికి అమ్మేసిన భార్య!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions