Sundar Pichai calls Vizag AI hub a landmark as Google invests $15 billion | విశాఖపట్నంలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. వైజాగ్ ను ఏఐ సిటీగా మార్చే విధంగా గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, గూగుల్ ప్రతినిధులు ప్రకటించారు.
ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ‘భారత్ ఏఐ శక్తి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. భారత ప్రధాని ప్రధానమంత్రితో ఈ పెట్టుబడిపై మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నంలో మొట్టమొదటి గూగుల్ AI హబ్ విశేషాలను, ప్రణాళికలను ప్రధానితో పంచుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ హబ్ గిగావాట్-స్థాయి కంప్యూట్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్వే, మరియు పెద్ద-స్థాయి ఎనర్జీ మౌలిక సదుపాయాలను కలిగి ఉందని సుందర్ పిచాయ్ వివరించారు. దీని ద్వారా సాంకేతికతను భారతదేశంలోని సంస్థలకు మరియు వినియోగదారులకు అందించనున్నట్లు AI ఆవిష్కరణలను వేగవంతం చేస్తూ దేశవ్యాప్తంగా వృద్ధిని ప్రోత్సహించనున్నట్లు పిచాయ్ ప్రకటించారు.










