Friday 11th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సాయిపల్లవి అన్నా అని పిలిచినందుకు ఫీల్ అయ్యా

సాయిపల్లవి అన్నా అని పిలిచినందుకు ఫీల్ అయ్యా

Siva Karthikeyan About Sai Pallavi | తమిళ నటుడు శివ కార్తికేయన్ ( Siva Karthikeyan ), సాయి పల్లవి ( Sai Pallavi ) జంటగా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన మూవీ ‘ అమరన్ ‘ ( Amaran ).

ఆర్మి అధికారి ముకుంద్ వరదరాజన్ ( Mukund Varadarajan ) బయోగ్రఫీ ( Biography )ఆధారంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెరకెక్కించారు. అక్టోబర్ 31న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చెన్నై ( Chennai )వేదికగా ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నటుడు శివ కార్తికేయ మాట్లాడారు. సాయి పల్లవిని తొలిసారి ఓ టీవీ ప్రోగ్రాం ( TV Program )లో కలిసినట్లు ఆయన చెప్పారు. సదరు ప్రోగ్రాంకు తాను యాంకర్ ( Anchor ) గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ ప్రోగ్రాంకు సాయి పల్లవి వచ్చిందని గుర్తుచేశారు.

మలయాళం మూవీ ‘ప్రేమమ్’ ( Premam )లో సాయి పల్లవి అద్భుత నటనను చూసి ఆశ్చర్యపోయినట్లు కార్తికేయ చెప్పారు. ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పగా సాయి పల్లవి తనను థ్యాంక్యూ అన్నా ( Thank You Anna ) అని పిలిచిందన్నారు. ఆమె అలా అనగానే తాను ఫీల్ ( Feel )అయినట్లు నటుడు శివ కార్తికేయ అనగానే అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.

You may also like
కర్ణాటక చిన్నారికి తెలంగాణ మంత్రి చేయూత
రిటైర్మెంట్ వయసుపై ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలు..మోదీ గురించేనా?
‘ప్రభుత్వ బడుల్లో అక్షర జ్యోతులు’
‘తెలంగాణ వచ్చి దశాబ్ధం దాటినా..యువకుల ఆత్మహత్యలు ఆగడం లేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions