Beerappa Siddappa Done | ఇటీవల విడుదల యూపీఎస్సీ సివిల్స్ (UPSC Results) పరీక్షా ఫలితాల్లో ఓ గొర్రెల కాపరి కుమారుడు సత్తా చాటారు. కురుబ కమ్యూనిటీకి చెందిన గొర్రెల కాపరి కుమారుడు బీరప్ప సిద్ధప్ప డోణే (Beerappa Siddappa Done) ఇలిండియా సివిల్ సర్వీసెస్ లో 551వ ర్యాంక్ సాధించాడు.
మహారాష్ట్రలోని అమాగే గ్రామానికి చెందిన బీరప్ప సిద్దప్ప కుటుంబం గొర్రెలు కాస్తూ జీవనం కొనసాగిస్తోంది. బి.టెక్ పూర్తి చేసిన బీరప్ప తన అన్నయ్య లాగా భారత సైన్యంలో చేరాలని అనుకున్నాడు. కానీ వివిధ కారణాల వల్ల అతను ఆఫీసర్ల నియామక పరీక్షలకు హాజరుకాలేదు.
ఇండియా పోస్ట్ లో ఉద్యోగం వచ్చింది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఉద్యోగం మానేసి IAS పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించాడు.
తన మూడవ ప్రయత్నంలో పరీక్షలను క్లియర్ చేశాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లా నానావాడి గ్రామంలోని తన బంధువుల దగ్గర ఉన్నప్పుడు యూపీఎస్సీ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో వెంటనే బీరప్ప బంధువులు అతడికి సన్మానం చేశారు. కురుబ కమ్యూనిటీ వేషధారణ చేసి మిఠాయిలు పంచుకున్నారు.