Mission bhagiratha contract employee suicide issue
నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికురాలి ఆత్మహత్య కలకలం రేపింది.
సకాలంలో జీతం అందక, అప్పుల బాధ తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. తనలాగా మరే కుటుంబానికి ఇలా జరగకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
NALGONDA| నల్గొండ జిల్లా పానగల్ లో మెషీన్ భగీరథ ప్లాంట్ ఏర్పాటుకు స్థానికుడైన సింగం మహేష్ మూడెకరాల భూమిని పరిహారం ఇచ్చి ప్రభుత్వం తీసుకుంది. భూమిని ఇచ్చినందుకు మహేష్ కు మెషీన్ భగీరథలో కాంట్రాక్ట్ ఉద్యోగుడిగా ప్రభుత్వం నియమించింది.
2016 లో మహేష్ అనుముల మండలం, అల్వాల కు చెందిన పుష్పాలతకు వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. మహేష్ కి నెలకు రూ.9 వేల జీతం.కాని మహేష్ 2020 మార్చ్ 3న ఆత్మహత్య చేసుకున్నాడు.
జీతం సరిపోక, సకాలంలో జీతం అందక, అప్పులపాలయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. తర్వాత మహేష్ స్థానం లో పుష్పాలతకు ఉద్యోగం లభించింది.
“ఇక్కడ ఉద్యోగం చేస్తున్న నాకు సకాలంలో జీతం రాదు, ఈ మధ్య కాలంలో అరోగ్య సమస్య వచ్చింది. జీతం సరిపోక అప్పులు చేయాల్సి వచ్చింది. నా భర్త ఆత్మహత్య చేసుకున్న కూడా ఎవరూ సహాయం చెయ్యలేదు, ఇప్పుడు నేను నా పిల్లలని పోషించలేక పోతున్నాను.
నా పిల్లలకు న్యాయం చెయ్యండి, నా లాగా మరే కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావొద్దు.. నా చావుకు నేనే కారణం” అని లేఖలో రాసి పుష్పాలత గురువారం పిల్లలు పాఠశాలకు వెళ్ళాక ఆత్మహత్యకు పాల్పడింది.
దీనితో పుష్పాలత పిల్లలు సాన్విత(6), నందన్(5) అనాధాలు అయ్యారు. సహచర ఉద్యోగులు ఒక్కసారిగా ప్రభుత్వం పైన భగ్గుమన్నారు. నల్గొండ ఎస్పీ బంగ్లా ఎదుట మెషీన్ భగీరథ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పాలత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం చేశారు.
తీవ్రంగా స్పందించిన షర్మిల…
Sharmila fires on telangana govt.| “నల్లగొండలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన దంపతులను పొట్టనపెట్టుకున్న పాపం బందిపోట్ల అధ్యక్షుడు కేసీఆర్ దే.
గతంలో జీతాలు రావడం లేదని భర్త మహేశ్ ఆత్మహత్య చేసుకుంటే.. భార్య పుష్పలత సైతం అదే కారణంతో ప్రాణాలు విడిచింది.అనాథలైన ఇద్దరి బిడ్డల శాపం ఈ సర్కారుకు కచ్చితంగా తగులుతుంది.
పుష్పాలత ఆత్మహత్య నేపథ్యంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.
దొర పాలనలో జనాలకు ఆత్మహత్యలే శరణ్యం. ఉరి తాళ్ళే దిక్కు.ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, జీతాలు రాక ఉద్యోగులు.. నాలాగా మరొకరికి కష్టం రాకూడదని లేఖలు రాసి మరీ ప్రాణాలు వదులుతున్నారు.
చివరికి పథకాలు దక్కాల్నన్నా గుండెలు ఆగాల్సిందే. జీతాల కోసం,పథకాల కోసం చేసుకొనే ఆత్మహత్యలు దొర బంగారు పాలనకు నిదర్శనం.
అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పే మంత్రి హరీష్ రావుకైనా మిషన్ భగీరథ కార్మికుల కష్టాలు పట్టడం లేదు. ఇక చిన్న దొర ఇలాకాలో ఇల్లు రాలేదని చనిపోయిన రాజు మృతికి కేటీఆర్ బాధ్యత వహించాలి.
సిరిసిల్లలో ప్రభుత్వ పథకాలు అందని గడపే లేదని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. రాష్ట్రాన్ని నడిపేందుకు 5 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా పథకాలకు డబ్బు లేదు.
జీతాలు ఇవ్వడానికి, పెంచడానికి రూపాయి లేదు. బంగారు తెలంగాణలో దొర కుటుంబం బంగారమైతే..పేదలకు బ్రతుకు భారమైంది.
కేసీఆర్ ను YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. మిషన్ భగీరథలో పని చేసే 16 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాన్ని పెంచండి.
వారికి ఉద్యోగ భద్రత కల్పించండి.ఇంకో కుటుంబం ప్రాణాలు తీసుకోక ముందే మొద్దు నిద్ర వీడండి”.అని ట్విట్టర్ వేదికగా షర్మిల స్పందించారు.