Shabarimala Temple | కేరళలోని శబరిమలకు ఈ ఏడాది అయ్యప్ప భక్తులు తాకిడి గనణీయంగా పెరిగింది. ఈ ఏడాది ఆలయం ప్రారంభం అయిన గత 39 రోజుల్లో దాదాపు 31 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.
తద్వారా రూ. 200 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి 11 గంటల నుంచి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నారు.
అనంతరం మకరవిలక్కు పండుగ కోసం మళ్లీ డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం స్పష్టం చేసింది.
అప్పటి నుంచి జనవరి 15 వ తేదీ మకర జ్యోతి పూర్తయ్యే వరకు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జనవరి15న సాయంత్రం 6 గంటల 36 నిమిషాలకు జ్యోతి దర్శనం ఉందనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి 20న ఆలయం మూసివేస్తారు.