Rishi Sunak Plays Cricket In Mumbai | యునైటెడ్ కింగ్డమ్ ( UK ) మాజీ ప్రధాని రిషి సునాక్ భారత దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ముంబై నగరంలో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు.
రాజస్థాన్ జైపూర్ లో ఐదు రోజుల పాటు జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్ వచ్చారు. శనివారం ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ముంబై చేరుకున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం సౌత్ ముంబయి లోని పార్సీ జింఖాన గ్రౌండ్ కు వెళ్లారు. క్లబ్ వార్షికోత్సవాల నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. ‘టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబయి పర్యటన ఎప్పుడూ ముగియదు’ అని రిషి సునాక్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.