YSRCP About Chandrababu Assets | సొంత తల్లి, చెల్లికి ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా వేధించిన వ్యక్తి వైసీపీ అధినేత వైఎస్ జగన్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో వ్యాఖ్యానించారు.
తాజగా ఈ వ్యాఖ్యల పై వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మహిళల సాధికారికత కోసం టీడీపీ కృషి చేస్తుందని, కానీ వైఎస్ జగన్ ఇందుకు పూర్తి వ్యతిరేకమని సీఎం హాట్ కామెంట్స్ చేశారు. తల్లికి, చెల్లికి ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా మోసగించిన వ్యక్తి రాష్ట్రానికి ఎం చేస్తాడని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో జగన్ పార్టీ స్పందించింది. చంద్రబాబు ఆస్తుల్లో తోబుట్టువుల వాటా ఎంత? అంటూ వైసీపీ ప్రశ్నించింది. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు అని, తమకు లక్ష కోట్ల ఆస్తి ఉందని చంద్రబాబు భార్య భువనేశ్వరి చెప్పినట్లు పేర్కొంది.
మరి ఈ ఆస్తుల్లో తోబుట్టువులకు చంద్రబాబు ఎంత వాటా ఇచ్చాడు?, తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కుటుంబానికి ఎంత వాటా ఇచ్చాడు? అంటూ జగన్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇవ్వకపోగా తన తల్లిపేరుమీద హైదరాబాద్‌లో మదీనా గూడలో ఉన్న భూమిని ఏకంగా తన కుమారుడు లోకేష్ పేరుమీద మార్పించిన మాట వాస్తవం కాదా? అని నిలదీసింది.
చంద్రబాబు తన ఇంట్లో న్యాయం పాటించకుండా.., ఇంకొకరి ఇంటి వ్యవహారాల గురించి మాట్లాడ్డం అన్యాయం కాదా? అంటూ వైసీపీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.