Sunday 1st March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అయ్యప్ప భక్తులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్..

అయ్యప్ప భక్తులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్..

Rammohan Naidu On Ayyappa Devotees | అయ్యప్ప దీక్ష సమయంలో స్వామివారి దర్శనం కోసం శబరి ( Sabari ) వెళ్లే భక్తులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu ) తీపి కబురు అందించారు.

ఇప్పటివరకు శబరి వెళ్లే స్వాములు తమ ఇరుముడిని చెకిన్ ( Check in ) బ్యాగులో తీసుకెళ్లేవారు. కానీ ఇకనుండి విమానంలో ప్రయాణించే సమయంలో ఇరుముడిని తమవెంటే తీసుకెళ్లొచ్చని మంత్రి స్పష్టం చేశారు.

చెకిన్ బ్యాగులో కాకుండా అయ్యప్ప స్వాములు ఇరుముడిని తమ వెంటే విమానంలో తీసుకెళ్లి వేసులుబాటును కల్పించారు. భద్రతా కారణాల మూలంగా స్వామివారి మాల ధరించిన వారు ఇరుముడిని చెకిన్ బ్యాగులో పెట్టి తీసుకెళ్లేవారు.

కానీ భక్తుల ఇబ్బందులు తెలుసుకుని వచ్చే ఏడాది జనవరి 20 వరకు ఈ నిబంధనకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో ను విడుదల చేశారు. కేంద్రమంత్రి నిర్ణయం పట్ల అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు
ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions