Rahul Gandhi Comments On Telugu | కాంగ్రెస్ అగ్రనాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలుగు భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన డల్లాస్ లో ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని చెప్పారు. భాష, సంప్రదాయాల పేరుతో ఎవర్ని వేరుచేసి చూడొద్దని పేర్కొన్నారు. మన జాతీయ గీతం దేశాన్ని రాష్ట్రాల సమాఖ్య చెపుతుందని, అన్ని రాష్ట్రాలు సమానమే అన్ని తెలిపారు.
తమిళం మాట్లాడే వారు నచ్చరు, హిందీ మాట్లాడేవారు నచ్చుతారు అని చెప్పడం సరికాదని హితవుపలికారు. మనం తెలుగు భాష గురుంచి మాట్లాడినప్పుడు అది కేవలం ఒక భాషనే కాదు, ఒక చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి.
హిందీ భాషతో పోల్చుతూ, తెలుగు అంత ముఖ్యం కాదని ఎవరైనా అంటే అది వారిని అవమానించినట్లే అని స్పష్టం చేశారు. ఈ చిన్న తేడాను కొందరు అర్ధం చేసుకోలేకపోతున్నారని బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.