Saturday 10th May 2025
12:07:03 PM
Home > క్రీడలు > స్టార్ క్రికెటర్ కెరీర్ ఎందుకిలా అయ్యింది

స్టార్ క్రికెటర్ కెరీర్ ఎందుకిలా అయ్యింది

Prithvi Shaw News | కేవలం 18 ఏళ్లకే టీంఇండియా ( Team India ) జట్టులో స్థానం సంపాదించి, తొలి టెస్టులోనే సెంచరీ చేసి అందరి చేతా ప్రశంసలు పొందాడు.

అయితే క్రమశిక్షణారాహిత్యం, ఫిట్ నెస్ ( Fitness ) మెయింటైన్ చేయకపోవడం మూలంగా ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాడు. ఆ స్టార్ క్రికెటరే 24 ఏళ్ల పృథ్వీ షా ( Prithvi Shaw ). నిత్యం ఏదొక వివాదంలో చిక్కుకుంటూ ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నాడు.

ఓ వైపు టీం ఇండియా లో చోటు లేకపోగా తాజాగా, రంజీ టీంలోనూ స్థానం కోల్పోయాడు. ముంబై రంజీ టీం ( Mumbai Ranji Team )కి పృత్వీ షా ను ఎంపిక చేయలేదు. నెట్ సెషన్స్ ( Net Sessions )కు ఆలస్యంగా రావడం, ఎక్కువ డుమ్మాలు కొట్టడం, అధిక బరువు వంటి కారణాల మూలంగా ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

క్రమశిక్షణచర్యల్లో భాగంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి మేనేజ్మెంట్, సెలెక్టర్లే కాకుండా కోచ్ ( Coach ), కెప్టెన్ ( Captain ) కూడా అంగీకారం చెప్పినట్లు సమాచారం.

You may also like
‘దేశ రక్షణ నిధికి ఏపీ స్పీకర్ విరాళం’
‘పాక్ కు లోన్..IMF పై విరుచుకుపడ్డ ఒవైసీ’
‘భారత్-పాక్ ఉద్రిక్తతలు..డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన’
‘పాక్ లో పట్టుబడ్డ భారత పైలట్..నిజం ఏంటంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions