PM Modi Hoists National Flag | భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం (79th Independence Day) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వేదికగా జాతీయ జెండా (National Flag)ను ఆవిష్కరించారు. అంతకుముందు ప్రధాని రాజ్ ఘాట్ లో నివాళి అర్పించారు.
అనంతరం ఎర్రకోట వద్దకు చేరుకొని త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎందరో త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్య్ర వేడుకలు అనీ, ఇది 140 కోట్ల మంది జరుపుకొనే పండగ అని తెలిపారు.
సమైఖ్య భావంతో దేశం ఉప్పొంగి, ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే తరుణమిది అని ప్రధాని అభివర్ణించారు. ఒకేదేశం ఒకే రాజ్యాంగం కలను సాకారం చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దేశ శ్రేయోభిలాషులందరికీ అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ.
ఈ వేడుకల్లో మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. వరుసగా 12వ సారి ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేసిన మోదీ ఎక్కువ సార్లు పత్కావిషరణ చేసిన మూడో ప్రధానిగా నిలిచారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) 17 సార్లు, ఆ తర్వాత ఇందిరా గాంధీ (Indira Gandhi) 16 సార్లు ప్రధానిగా తివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.









