Prakash Raj In Maha KumbhMela | నటుడు ప్రకాశ్ రాజ్ కు సంబంధించిన ఒక ఫోటో తాజగా వైరల్ గా మారింది. ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా ప్రకాశ్ రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరిస్తున్నట్లు ఆ ఫోటో ఉంది.
అది నకిలీదా లేక ఒరిజినలా ( Original ) అనేది తెలియకుండా కొందరు నెటిజన్లు ప్రకాశ్ రాజ్ పై విమర్శలు గుప్పించారు. తనకు తాను నాస్తికుడని చెప్పుకునే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు కుంభమేళాలో పవిత్ర స్నానం ఎలా చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నించారు.
కాగా వైరల్ గా మారిన ఫోటోపై తాజగా ప్రకాశ్ రాజ్ ఎక్స్ ( X ) వేదికగా స్పందించారు. ఫేక్ న్యూస్ అలెర్ట్ ( Fake News Alert ) అంటూ ఫోటో నకిలీది అని స్పష్టం చేశారు. ఫేకు మహారాజ్ యొక్క మతోన్మాదులు మరియు వారి పిరికి దళం యొక్క చివరి ప్రయత్నం ఇది అంటూ ఫైర్ అయ్యారు.
వారి పవిత్ర కార్యక్రమంలో కూడా ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసు ఫిర్యాదు చేసినట్లు, సంబంధిత వ్యక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.