Prabhas Marriage Rumors | నటుడు ప్రభాస్ పెళ్లిపై సోషల్ మీడియాలో నిత్యం ఏదొక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజగా హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఖాయం అయ్యిందని గురువారం ఉదయం నుండి ఓ వార్త వైరల్ గా మారింది.
అంతేకాకుండా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని కొన్ని వెబ్ సైట్లు కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ టీం స్పందించింది.
జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని ఫ్యాన్స్ ను టీం కోరింది.