Pothuluri Veerabrahmendra Swamy House Collapse | మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుతున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘోరం జరిగింది. కాలజ్ఞాని జగత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు నడయాడిన నివాసం భారీ వర్షాల కారణంగా తాజగా కుప్పకూలింది.
ఈ ఘటన భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అలాగే మఠం నిర్వాహకులు, అధికారుల తీరు పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల, నిర్వాహకులు అలసత్వం మూలంగానే ఈ ఘటన చోటుచేసుకుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నివాసాన్ని తిరిగి నిర్మించినా గత వైభవం ఉండదని పేర్కొంటున్నారు.
ఇంతటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసాన్ని పరిరక్షించడంలో ఎందుకింత నిర్లక్ష్యం చేశారని ప్రభుత్వాన్ని, అధికారులను, మఠం నిర్వాహకులను నిలదీస్తున్నారు భక్తులు. కాగా దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించి, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సి ఉంది.









