PM Modi Phone Call To Pawan Kalyan About Mark Health Condition | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కు అగ్నిప్రమాదంలో గాయాలయిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. మార్క్ శంకర్ ఆరోగ్యం పై ఆరా తీశారు. ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని డిప్యూటీ సీఎం పవన్ కు ధైర్యం చెప్పారు.
ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం సింగపూర్ లోని మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. దింతో పవన్ కుమారుడి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ..పవన్ కుమారుడు త్వరగా కొలుకోవలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అగ్నిప్రమాదంలో పవన్ తనయుడు గాయపడడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అలాగే మాజీ సీఎం జగన్..మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసి తాను షాక్ కు గురైనట్లు పేర్కొన్నారు. విశాఖ పర్యటన ముగిసిన అనంతరం పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. అలాగే చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్తున్నారు.