PM Narendra Modi | భారత 78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
అనంతరం ఎర్రకోటకు చేరుకున్న మోదీ.. త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. తర్వాత సైనికుల నుంచి గౌరవందనం స్వీకరించారు. ఎర్రకోటపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు.
వరుసగా 11వ సారి మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తద్వారా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన అధిగమించారు. అయితే, ఇప్పటి వరకూ అత్యధికంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 17 సార్లు జెండాను ఎగురవేయగా.. ఆయన తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు రెండో స్థానంలో ఉన్నారు.