Modi Fires On Rahul | కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పరోక్షంగా నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).
కాగా భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో భాగంగా ఇటీవల వారణాసిలో పర్యటించారు వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ.
ఈ సందర్భంగా కాశీలో కొందరు యువకులు తాగి రోడ్డుపై పడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారణాసిలో పర్యటించారు ప్రధాని. రూ.13 వేల కోట్ల మేర అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ..కాంగ్రెస్ పార్టీ యువరాజు వారణాసి (Varanasi) యువతను తాగుబోతులని అవమానిస్తున్నడని ధ్వజమెత్తారు.
వారణాసి యువత తాగి పడిపోతున్నారా ? అస్సలు ఇదేం భాష అంటూ మండిపడ్డారు. మతిస్థిమితం కోల్పోయిన వారు యువతను తాగుబోతులని చిత్రీకరిస్తున్నారని కన్నెర్ర చేశారు.
మోదీ ని దూషిస్తూ రెండు దశాబ్దాలు గడిపారని కానీ ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ యువతపై తమ ఫ్రస్ట్రేషన్ ను చూపిస్తున్నారని విమర్శించారు ప్రధాని.
ఇండి కూటమి (Indi Alliance) ద్వారా యూపీ యువతకు జరిగిన అవమానాన్ని ఎవరు మర్చిపోలేరని పేర్కొన్నారు.