Allu Arjun New Look At Nampally Court | నటుడు అల్లు అర్జున్ శనివారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో కోర్టుకు హాజరైన బన్నీ సరికొత్త లుక్ లో కనిపించారు. పుష్ప ది రైజ్, పుష్ప-2 ది రూల్ సినిమాల కోసం సుమారు ఆరేళ్ల పాటు మాస్ లుక్ లోనే ఐకాన్ స్టార్ ఉన్నారు. 2019 నుండి పొడవైన జుట్టు, గడ్డం పెంచసాగారు.
అయితే తాజాగా నాంపల్లి కోర్టు ఆవరణలో కనిపించిన ఈ నటుడు నార్మల్ లుక్ లో మెరిశారు. కోర్టు దగ్గర అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.
ప్రస్తుతం బన్నీ న్యూలుక్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వచ్చి వెళ్లేంత వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.