Friday 18th October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నేటి నుంచి ‘పల్లె పండుగ’..సంక్రాంతి వరకు పనులు పూర్తి!

నేటి నుంచి ‘పల్లె పండుగ’..సంక్రాంతి వరకు పనులు పూర్తి!

Palle Panduga | ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి పల్లె పండుగ కార్యక్రమం మొదలవనుంది. ‘ పల్లె పండుగ ప్రగతికి అండగా (Palle Panduga Pragathiki Andaga)’ అనే పేరుతో గ్రామసభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించిన పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

అక్టోబర్ 14 నుండి 20 వరకు పంచాయతీ వారోత్సవాల్లో భాగంగ రూ.4500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టనున్నారు. ఇందులో గ్రామాలను కనెక్ట్ చేసేందుకు 3000 కీ.మీ. మేర సిమెంట్ రోడ్లు, 500 కి.మీ. మేర బీటీ రోడ్లు వేయనున్నారు.

అలాగే 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని, 25000 గోకులాలు, 10000 ఎకరాల్లో నీటి సంరక్షన ట్రెంచులు నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

You may also like
arasavalli temple
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. ఆలయంలోకి సూర్య కిరణాలు!
cbn
TTS నిబంధనలు పాటించాల్సిందే.. చంద్రబాబు కీలక ట్వీట్!
Bhumana karunakar reddy
జగన్ ని అది అడిగితే పతనం ఖాయం: భూమన హెచ్చరిక!
ycp leaders join janasena
పవన్ సమక్షంలోజనసేనలోకి వైసీపీ కీలక నేతలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions