OU JAC Students Attack On Allu Arjun House | నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ నేతలు మెరుపు ఆందోళన చేపట్టారు. దింతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది.
సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నేతకు నినదించారు. కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొందరు అల్లు అర్జున్ ఇంటిపైకి రాళ్లు, టమోటాలు విసిరేశారు. దింతో ఇంట్లోని పూల కుండీలు ధ్వంసం అయ్యాయి. ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు.
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఘటనపై ఆరా తీశారు.